మంచి శృంగారం వలన మెదడులో "ఎండార్ఫిన్స్" అనే పదార్థాలు విడుదలవుతాయి. వీటిని మెదడే తయారు చేసుకుంటుంది. వీటివల్ల శరీరంలో నొప్పులు తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మంచి నిద్ర కలుగుతుంది. అందుకే కీళ్ళ నొప్పులు ఉన్నవారు, నిద్ర సరిగా పట్టని వారు రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనాలి.

అంతేకాకుండా శరీరంలో కార్టిజోన్స్‌ విడుదలై వాపు, నొప్పి తగ్గుతాయని కూడా ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డాక్టర్ జాన్‌ బ్యాంకప్ట్‌ ఉద్దేశం. సెక్స్‌‌లో భార్యాభర్తలు కలిసి జీవించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. ఈ విధంగా చేయడం ద్వారా సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఇవన్నీ ధార్మికమైన శృంగారం వలనే కలుగుతాయి.భార్యతో శృంగారంలో పాల్గొనడం లేదా స్వయంతృప్తిలోనే కలుగుతాయి. అక్రమసంబంధాలు అనేక అనర్థాలకు దారితీస్తాయి. సుఖవ్యాధుల వ్యాప్తి, ఆందోళనలు, సెక్స్‌ సమస్యలు, సంసారాలు విడిపోవడం జరుగుతాయి. ప్రపంచంలో చాలా యుద్ధాలకు మూలకారణం అక్రమ సంబంధాలేనని చరిత్ర పాఠాలు చెపుతున్నాయి. కనుక సక్రమమైన, ధార్మికమైన శృంగారం అనేక ఉపయోగాల్ని కలిగించి వ్యక్తికి, సమాజానికి మేలు చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

భార్యాభర్తల శృంగారం జీవితానికి పరమౌషధం