వాత్సాయనుని కామసూత్రాలు  అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు. గ్రంథంలోని కొంతభాగం మానవ లైంగిక ప్రవర్తన గురించి చెప్పబడింది. కామము అనగా కోరిక. లైంగిక వాంఛ కూడా కామమే. సూత్రము అనగా నియమము.సాధారణంగా కామశాస్త్రమనే గ్రంథాల సమహారంలో కామసూత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం.

క్రీ.పూ 400-200 సంవత్సరాల మధ్యలో కామసూత్ర రచించబడి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయము. చరిత్రకారుడు జాన్ కీయే కామసూత్ర ఒక సంకలనమని, ఇది ప్రస్తుతమున్న స్థితిలో క్రీ.శ. రెండవ శతాబ్దములో సేకరించబడినదని చెప్పాడు.vastyana

కామసూత్ర పీఠికలో వాత్సాయనుడు అతని కంటే పూర్వపు గ్రంథకర్తల యొక్క రచనలు తన రచనకి ఎలా ఉపయోగపడ్డాయో ప్రస్తావిస్తాడు. తన రచనలోని ఏడు భాగాలు దత్తకుడు, సువర్ణనభుడు, ఘోతకముఖుడు, గోనర్దియుడు, గోనికపుత్రుడు, చారాయణుడు, మరియు కుచుమారుని రచనల యొక్క సంగ్రహాలని తెలుపుతాడు. వాత్సాయనుని కామసూత్రాలు 1250 పద్యాలతో, 36 విభాగాలు, 7 భాగాలుగా వ్రాయబడ్డాయి. బర్టన్, డోనిగర్ వంటి అనువాదకులు కూడా ఇదే మూలపద్ధతిని అనుసరించారు

సాధారణం) - మొదటి విభాగంలో పుస్తక విషయము, అమరిక గురించి క్లుప్తంగా వివరించబడింది. పరిచయభాగములోని ఇతర విభాగాలు జీవిత గమ్యాలు ప్రాముఖ్యత, విజ్ఞాన సముపార్జన, సజ్జనులు, ఉన్నత కుటుంబాలనుండి వచ్చిన నాగరీకుల నడవడిక, విటునికి సహాయపడే మధ్యవర్తుల గురించిన విషయాలను చర్చించబడ్డాయి (5 విభాగాలు).

పరిచయం