సంప్రయోగికం - విభాగాలు కామోద్దీపనం, ఆలింగనాలలో రకాలు, నిమురుట మరియు చుంబనములు, నఖక్షతాలు, దంతక్షతాలు, రతి భంగిమలు, తాడనాలు, అనుబంధిత శీత్కారాలు, అధిక లైంగిక శక్తి గల స్త్రీల గురించి, ఉపరతి మరియు ముఖ రతి, రతికేళి యొక్క అంత్యారంభాల గురించి వివరిస్తాడు. దీనిలో 64 రకాల కామ క్రీడలు వివరించాడు .

స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగం కార్యంలో పురుషుడు తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడం వలన స్త్రీకి మాతృత్వం సిద్ధిస్తుంది. పురుషుని వీర్యంలోని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన

తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం లేదా కడుపూ'(Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి లేదా గర్భిణి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మిస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్

(Obstetrics) అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది. ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను 'పిండం ' అంటారు. 'శిశువు' అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. స్త్రీలకు ప్రతి నెల బహిష్టు (Menses) పూర్తైన తర్వాత గర్భాశయంలో అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో స్త్రీ పురుషుడితో సంభోగించినప్పుడు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్ కాలాలుగా విభజిస్తారు. గర్భధారణ సమయం నుండి పన్నెండు వారాల వరకు మొదటి త్రైమాసికం అంటారు. గర్భధారణలో మొదటిగా ఫలదీకరణ చెందిన అండము ఫెలోపియన్ ట్యూబ్ గుండ ప్రయాణించి గర్భాశయం లోపలి గోడకు అతుకుంటుంది. ఇక్కడ పిండం మరియు జరాయువు తయారవుతాయి. మొదటి ట్రైమిస్టర్ కాలంలో ఎక్కువగా గర్భస్రావం

జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పదమూడవ వారం నుండి ఇరవై ఎనమిదవ వారం వరకు రెండవ త్రైమాసికం అంటారు.రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. ఇరవై తొమ్మిది వారాల నుండి నలబై వారాల వరకు మూడవ త్రైమాసికం అంటారు. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది. శిశువు జన్మించడానికి ముందు తగు జాగ్రత్తలు తీసుకొనుట చాలా అవసరం.

అనగా అదనపు ఫోలిక్ ఆమ్లం తీసుకొనుట, సాధారణ వ్యాయామం చేయుట మరియు రక్త పరీక్షలు చేయించుకోవడం . గర్బవతులకు అధిక రక్తపోటు, మధుమేహం, అనీమియా, తీవ్రమైన వికారం

మరియు వాంతులు వచ్చే అవకాశము ఉంది . సాధారణంగా 37 మరియు 38 వారాలని అర్లీ టర్మ్ అని, 39 మరియు 40 వారాలని ఫుల్ టర్మ్ అని, 41 వారాన్ని లేట్ టర్మ్ అని అంటారు. 37 వారాల కన్నా ముందు శిశువు జన్మిస్తే వారిని అపరిపక్వ శిశువు అంటారు.

శృంగార కలయిక