గర్భిణులు అదేపనిగా సెల్ ఫోన్ల మాట్లాడుతుంటే పుట్టే పిల్లల్లో ప్రవర్తన పరమైన సమస్యలు తలత్తుతాయని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. ఇదెంత వరకూ నిజమో తెలియదుకానీ.. ప్రాథమిక అధ్యయన ఫలితాలు మాత్రం గర్భిణులు అతిగా సెల్ ఫోన్ వాడకపోవమే మంచిదని సూచిస్తున్నాయి. ఇటివల చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 13 వేలమంది పిల్లల్ని పరిశీలించారు. ఆ పిల్లల తల్లుల్ని గర్భిణులుగా ఉన్నప్పుడూ, పిల్లలకు 18 నెలల వయసు వచ్చిన తర్వాతా, మళ్లీ ఏడేళ్ల వయసులోనూ పరిశీలించారు. ఎక్కువగా సెల్‌ఫోన్ వాడే పిల్లల్లోనూ, వారు కడుపులో ఉన్నప్పుడు తల్లులు అతిగాసెల్‌ఫోన్ వాడినవారిలోనూ పిల్లల్లో ప్రవర్తన పరమైనసమస్యలు తలత్తినట్లు గుర్తించారు. ఇలాంటి పిల్లల్లో ఉద్వేగాలు ఎక్కువగా ఉండం, ఏకాగ్రత కుదరకపోవడం, అతిచురుకుదనం వంటి సమస్యలు ఉంన్నట్లు తేలింది

Vatsyana_image
pregnant

గర్భిణులకు సెల్ వద్దు