కొందరు స్త్రీలకి నెలనెలా ఖచ్చితంగా బహిష్టు వస్తుంది. సక్రమంగా బహిష్టు రావడం వున్నా, ఆ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువ అవుతుంది. అంతేకాదు 3-4 రోజులకి ఆగకుండా ఎక్కువ రోజులు అయిపోతుంది. దానితో నీరసం వచ్చేస్తుంది. ఇలా నెలనెలా బహిష్టు అవుతూనే అందులోనే అధికంగా బ్లీడింగ్‌ అవడాన్ని 'మెనొరేజియా' అంటారు.
అధికంగా బ్లీడింగ్‌ అవడానికి సాధారణంగా హ ర్మోన్ల అస్తవ్యస్తత కారణం. ఈస్ట్రో జన్‌-ప్రొజిస్టిరోన్‌ హ ర్మోన్ల అస్తవ్యస్తత విషయం అలా ఉండగా థైరాయిడ్‌ గ్రంధి అధికంగా పనిచేసే వారిలో బ్లీడింగ్‌ అతిగా అవుతుంది.40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో థైరాయిడ్‌ గ్రంధి తక్కువ పనిచేయడం కూడా కొందరికి బ్లీడింగ్‌ ఎక్కువ అవడానికి కారణం. అందుకని సరైనా కారణం తెలుసుకుని లోపాన్ని సరిదిద్దితే బ్లీడింగ్‌ ఎక్కువ అవడం తగ్గుతుంది.
బహిష్టు సమయంలో బ్లీడింగ్‌ని కంట్రోలు చేయడానికి పాన్‌స్టాన్‌-500, మెఫ్టాల్‌-500 బిళ్లలు రోజుకి 3 చొప్పున బ్లీడింగ్‌ కంట్రోలు అయ్యేవరకు వాడాలి. కొందరికి ఇతర మందులు వాడవలసి వుంటుంది.
కొందరు స్త్రీలకి పెళ్ళికాకుండానే, పిల్లలు పుట్టకుండానే బహిష్టు సమయంలో అధికంగా బ్లీడింగ్‌ అయ్యే సమస్య వుంటుంది. ఇటువంటి వారికి చిన్నాపరేషన్‌ (క్యూరటాజ్‌) చేయడం, హ ర్మోన్లు టాబ్లెట్లు వాడటం చేయాలి. దానితో చాలావరకు బ్లీడింగ్‌ అదుపు అవుతుంది. బ్లీడింగ్‌ అధికంగా అవుతున్నప్పుడు ఆందోళన లేకుండా మనసుని ప్రశాంతంగా వుంచుకొని, విశ్రాంతి తీసుకోవడం చేయాలి

Vatsyana_image
 బహిష్టు

బహిష్టులో బ్లీడింగ్ అధికంగా ఉంటే