కుటుంబాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారా? ఆరోగ్యకర గర్భధారణ జరగాలి అనుకుంటే ముందు నుండే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి సమస్యలు లేని గర్భాన్ని పొందుటకు పాటించాల్సిన చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.ముందు నుండే ప్రారంభించండి
ఒకటి నుండి మూడు నెలల ముందు గర్భం ధరించుటకు ప్రణాళికను సిద్దం చేసుకోండి. వైద్యుడిని కలిసి ఆరోగ్య పరీక్షల నిర్వహించి, మీ శరీరం గర్భం దాల్చాటానికి అనువుగా ఉందో లేదో తెలుసుకోండి. అంతేకాకుండా, మీరు జనన నియంత్రణ మాత్రలు వాడారో లేదా వంశపారంపరంగా ఎవైన సమస్యలు ఉన్నాయో కనుక్కోండి.
తీసుకునే మందుల పట్ల అవగాహన
మార్కెట్లో లభించే మందులలో పిండాభివృద్దికి సహాయపడితే మరికొన్ని పిండానికి హాని కలిగించేవిగా ఉంటాయి. మీరు ఎవైన మందులు కొనసాగిస్తుంటే, గర్భం దాల్చాటానికి ముందు వైద్యుడిని కలిసి ఈ మందుల గురించి చర్చించటం మంచిది. ఇలా చేయటం వలన మీ శరీరాన్ని గర్భధారణకు సిద్దం చేసుకున్న వారవుతారు లేదా గర్భసమయంలో తీసుకోకూడని మందులు ఉంటే వైద్యుడు వాటిని నిరాకరిస్తాడు.
ఒత్తిడికి దూరం
తీవ్ర ఒత్తిడితో కూడిన పరిస్థితులు గర్భవతులకు మంచిది కాదనే చెప్పాలి. కావున గర్భం ధరించాలి అనుకునే వారు ఒత్తిడికి దూరంగా ఉండాలి మరియు తనువు-మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ జీవితంలో ఒత్తిడిని కలుగచేసే కారణాలను కనుక్కొని, వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. యోగ, ధ్యానం లేదా రచనలు వంటి కార్యాలు ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి.
గర్భ సమయంలో, శిశువు కావాల్సిన అన్ని రకాల పోషకాల గురించి మీపై ఆధారపడుతుంది. ఒకవేళ తక్కువ బరువు ఉంటే గర్భం ధరించటానికి ముందే చెక్ చేసుకోండి. అధిక బరువు లేదా తక్కువ బురువు వివిధ సమస్యలకు గురి చేస్తాయి. గర్భధారణ, గుండెపై బరువు మరియు ప్రసవ సమయంలో పోషకాల కొరత వంటి సమస్యలు బరువులో వ్యత్యాసాల వలన కలుగుతాయి

Vatsyana_image
g

గర్భాన్ని ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు